నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. భీంగల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోందని మంత్రి వేముల తెలిపారు. గత ఎన్నికలో గెలిచిన భాజపా పసుపు బోర్డు విషయంలో రైతులను మోసం చేసిందని విమర్శించారు. 90 శాతం మెజార్టీతో తెరాసయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : 'ఆ 14 మంది పీపీఈ కిట్ ధరించి ఓటు వేశారు'