ETV Bharat / state

కేసీఆర్ ప్రణాళికల వల్లే రైతులకు సాగునీటి గోస తప్పింది: ప్రశాంత్​ రెడ్డి

author img

By

Published : Feb 3, 2022, 12:20 PM IST

Prashanth reddy Review: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగు నీరందించే కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి చెందిన ఇరిగేషన్ శాఖ అధికారులతో హైదరాబాద్​​లోని తన అధికారిక నివాసంలో సుదీర్ఘంగా సమీక్షించారు.

minister review
మంత్రి సమీక్ష సమావేశం

Prashanth reddy Review: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రణాళికలవల్ల రైతులకు సాగునీటి గోస లేకుండా పోయిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​లో మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో బాల్కొండ నియోజకవర్గ ఇరిగేషన్ శాఖ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగు నీరందించే కార్యక్రమాలు చేపట్టామన్నారు.

15రోజుల్లో ప్యాకేజ్-21 ట్రయల్ రన్

మెంట్రాస్ పల్లి పంప్ హౌస్ ద్వారా లక్షా, 15 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఆస్కారం ఉండగా... అందులో బాల్కొండ నియోజకవర్గంలోనే 70,500 ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయని తెలిపారు. ఎంఎస్‌ పైప్​లైన్ పనులు 88 కిలోమీటర్లకు గాను కేవలం 7.3 కిలోమీటర్ల వర్క్ మాత్రమే పూర్తి కావాల్సి ఉందని.. పనుల్లో వేగం పెంచి అతి త్వరలో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. డిఐ పైపులైన్ మొత్తం 192 కిలోమీటర్లకు గాను 122 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయ్యిందని.. మిగతా 59 కిలోమీటర్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో పెద్దవాగు, కప్పలవాగు ఎప్పుడూ నీటితో చూడాలనే తన కల నిజం కాబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. ప్యాకేజ్ 21 ద్వారా రూ.850 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు పూర్తి కావస్తున్నాయని.. బినోల నుంచి బాల్కొండ నియోజకవర్గ ప్రాంతానికి నీళ్లు తెచ్చే కార్యక్రమంలో భాగంగా 15 రోజుల్లో దానికి సంబంధించిన ట్రయిల్ రన్ ప్రారంభం కానుందన్నారు. మూడు ఎకరాలకు ఒక నీటి డెలివరీ పాయింట్ ఉంటుందని, రైతులకు ఎలాంటి ఖర్చు భారం లేకుండా ప్రతి ఎకరానికి నీరందించే పని జరుగుతోందని వెల్లడించారు. దానికి సంబంధించిన మెయిన్ పైప్ లైన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు.

చెక్​డ్యామ్​ల పునరుద్ధరణపై దృష్టి

ఈ వానాకాలంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయని.. అధికంగా వరదలతో దెబ్బతిన్న చెక్ డ్యామ్​లను రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే పునరుద్ధరించాలని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఎస్ఈ మధుసూధన్, డీఈ బాను ప్రకాష్, వర్క్ ఏజన్సీ ప్రతినిధులు మెగా శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.