నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను తెరాస నేతలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాయలం వద్ద, పలు గ్రామాల్లో కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి ఉన్నత పదువులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గులాబీ రంగు చొక్కాలో తెరాస ఏజెంట్లు.. అడ్డుకున్న పోలీసులు