నిజామాబాద్ జిల్లాలో.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సంఘం అధ్యక్షుడు చక్రపాణి హెచ్చరించారు. వారి ఇబ్బందులకు పరిష్కారాన్ని కోరుతూ.. డీఈఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. కష్టకాలంలో ప్రైవేటు స్కూల్ టీచర్ల మాదిరిగానే.. తమకూ నెలకు రూ. 2 వేలతో పాటు 25 కేజీల బియ్యం కేటాయించాలని డీఈఓకు వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 20 సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి అహర్నిశలు శ్రమించిన తమను.. ఆపత్కాలంలో ప్రభుత్వమే ఆదుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రాల మాదిరిగా.. గౌరవం వేతనం కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి: Viral: హెల్మెట్‌ను మింగిన ఏనుగు