తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రభుత్వాసుపత్రుల్లో, మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం జీవో నంబర్ 60ని రద్దు చేసి కనీస వేతనం 19 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఓమయ్య డిమాండ్ చేశారు. పండుగ, జాతీయ, ఆర్జిత సెలవులు నిర్ణయించి అమలు చేయాలని లేనిపక్షంలో ప్రతి రోజు నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పి.సుధాకర్, నాయకులు రంజిత్, భాగ్యలక్ష్మి, హైమది, కవిత, వెంకట్, శ్రీధర్, లింగం తదితర కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య