ETV Bharat / state

'చేతివాటం చూపిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై కఠిన చర్యలు' - 'చేతివాటం చూపిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై కఠిన చర్యలు'

భూప్రక్షాళనలో చేతివాటం చూపిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై కఠిన చర్యలుంటాయని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయిలో నిర్వహించి మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.

MANDAL LEVEL MEETING IN INDHALVAI
author img

By

Published : Oct 23, 2019, 11:29 PM IST

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో కిందిస్థాయి ఉద్యోగుల చేతివాటం వల్ల అనేక లోపాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ వి.గంగాధర్​గౌడ్​తో కలిసి హాజరయ్యారు. రెవెన్యూ శాఖపై సమీక్షించిన ఎమ్మెల్యే... కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు వివరించారు. సమస్యలపై వెంటనే విచారణ జరిపించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్​కు సూచించారు. నియోజకవర్గంలోనూ అసైన్డ్ భూముల కమిటీ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములకు అసైన్డ్ చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు.

'చేతివాటం చూపిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై కఠిన చర్యలు'

ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన

tg_nzb_07_23_mandal_sarvasabya_samavesham_av_ts10136 ****************************************** Rajendhar, etv contributer, indalvai () నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ రమేష్ నాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ పై సమీక్ష ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ దస్త్రాల పక్షాళన తీసుకువచ్చిందని, దానిలో కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగుల చేతివాటం తో అనేక లోపాలు తలెత్తాయి అన్నారు. సర్పంచ్ సైతం గ్రామ రెవెన్యూ అధికారి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు దీనిపై వెంటనే విచారణ జరిపించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ ఆంజనేయులుకు సూచించారు. నియోజకవర్గంలోనూ అసైన్డ్ భూముల కమిటీ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములకు అసైన్డ్ చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తాను గత ఐదేళ్లలో మిట్టపల్లి గ్రామం వద్ద అరవై ఎకరాల భూమి పవర్గ్రిడ్ సంస్థకు మాత్రమే అసైన్డ్ కమిటీ సహకారంతో భూమిని కేటాయించినట్లు వివరించారు. ఇంకెక్కడైనా అసైన్డ్ కమిటీ అనుమతి లేకుండా ప్రభుత్వ భూముల్ని పట్టాలు ఇస్తే ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని అవసరమైతే ఇంటికి పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం అటవీశాఖ, వ్యవసాయ శాఖ పై సమీక్ష కొనసాగించారు. కార్యక్రమంలో సభ్యురాలు సుమనా రెడ్డి, జక్రాన్పల్లి జెడ్పిటిసి తనుజ రెడ్డి, ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు.......vis

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.