ETV Bharat / state

'చెప్పులు కుట్టే వాళ్లకు సీఎం కేసీఆర్​ క్షమాపణ చెప్పాలి' - మందకృష్ణ మాదిగ వార్తలు

సీఎం కేసీఆర్​ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. చెప్పులు కుట్టే వారిని సీఎం అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు.

manda krishna madiga
మందకృష్ణ మాదిగ
author img

By

Published : Feb 10, 2021, 6:05 PM IST

నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలానికి వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం కేసీఆర్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మానికోల గంగాధర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

ముఖ్యమంత్రి పదవి తనకు ఎడమ కాలి చెప్పుతో సమానమని కేసీఆర్ మాట్లాడారని ... ఈ విషయంలో చెప్పులు కుట్టే జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధ్యతాయుత పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఆర్టీసీని నేను రెండో పెళ్లి చేసుకున్నా: మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.