ETV Bharat / state

గోదావరి నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

నిజామాబాద్​ జిల్లా నవీపేట్​ మండలం యంచ శివారులోని గోదావరి నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం పోలీసులు బయటకు తీశారు. ఒక రోడ్డు ప్రమాదంలో బాధితుడు రూ.15వేలు డిమాండ్​ చేసి.. తన ఆటో తీసుకెళ్లడం వల్ల మనస్తాపానికి గురైన సదరు వ్యక్తి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Man Dead Body Found In Godavari
గోదావరి నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
author img

By

Published : May 26, 2020, 7:20 PM IST

నిజామాబాద్​ జిల్లా నవీపేట్​ మండలం యంచ శివారులోని గోదావరి నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం పోలీసులు బయటకు తీశారు. మృతుడిని నిర్మల్​ జిల్లా బాసరకు చెందిన గొల్ల రాములుగా గుర్తించారు. నవీపేట్​ మండలం పాల్దా గ్రామానికి వచ్చిన రాములు అదేరోజు తన ఆటోలో తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో ఫకీరాబాద్​ వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ వాహనదారుడు రాములు వద్ద రూ.15వేలు డిమాండ్​ చేశాడు. డబ్బులు కట్టే వరకు ఆటో ఇవ్వనని రాములు ఆటోను వాహనదారుడు గుంజుకున్నాడు.

తీవ్ర మనస్తాపానికి గురైన రాములు యంచ శివారులోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల గాలింపులో రాములు మృతదేహం దొరికింది. రాములు మరణానికి ద్విచక్ర వాహనదారుడే బాధ్యత వహించాలని.. అతడి నుంచి నష్టపరిహారం ఇప్పించి.. ఆటోను తిరిగి ఇవ్వాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.