ETV Bharat / state

భార్య కాపురానికి రావడం లేదంటూ పెట్రోల్​ పోసుకొని భర్త ఆత్మహత్యాయత్నం - స్టేషన్​లో ఆత్మహత్యాయత్నం

Man Attempt Suicide at Police station : నాలుగేళ్లుగా భార్య కాపురానికి దూరంగా ఉంటూ పుట్టింట్లో ఉంటుందని ఆమె భర్త ఆవేదన చెందాడు. తన కుమార్తె వివాహం కూడా తనకు తన భార్య చెప్పకుండా చేస్తోందని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో పోలీస్​ స్టేషన్​ ఎదుట పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Man Attempt Suicide at Police station
భార్య కాపురానికి రావడం లేదంటూ పెట్రోల్​ పోసుకొని భర్త ఆత్మహత్యాయత్నం
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 3:38 PM IST

Man Attempt Suicide at Police Station : భార్య కాపురానికి రావడం లేదని, భర్త పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా(Nizamabad District) రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ పోలీస్ స్టేషన్ ఎదుట చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని సింగంపల్లి గ్రామానికి చెందిన రాజుకు కామారెడ్డి జిల్లా బిబిపేట్​కు చెందిన మహిళతో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది. నాలుగు సంవత్సరాలుగా భార్య, భర్తకు దూరంగా ఆమె పుట్టింట్లో ఉంది.

ఇవాళ కుమార్తె వివాహాన్ని భార్య, భర్త రాజుకు చెప్పకుండా చేస్తోంది. దీంతో మనస్తాపం చెందిన రాజు గోపాల్ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గ్రహించిన పోలీసులు రాజును చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి(Govt General Hospital) తరలించారు. 40% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మెట్రో ట్రాక్​పై యువతి ఆత్మహత్యాయత్నం- వైరల్ వీడియో వెనుక కథ ఇదీ!

పెళ్లి చేయరేమో అన్న భయంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.