నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మల్లన్నదేవుని జాతర ఘనంగా జరిగింది. ఉత్సవాలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. జాతరలో భాగంగా మల్లన్నదేవుని గుడి చుట్టు రథాన్ని తిప్పారు.
జాతర సందర్భంగా భక్తులు మల్లన్న దేవున్ని దర్శించుకుని పూజలు చేశారు. నైవేధ్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో మందిరం ఆవరణ కిటకిటలాడింది. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు సాగనున్నాయి.
ఇవీ చూడండి: కేరళ వరద బాధితులకు ఈనాడు ఇళ్లు అందజేత.. సీఎం పినరయి హాజరు