నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడు కూడలి వద్ద పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఇంటి ముందు నిలిపి ఉంచిన కారును ఢీ కొట్టింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడున్న ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నందునే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంతో భయపడినా ఎవరికీ ఏం కాకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: 'మహా' ట్విస్ట్: అజిత్ పవార్ రాజీనామా- అదే దారిలో దేవేంద్ర!