కార్గిల్ విజయ్ దివస్ సందర్బంగా భారతీయ జనతా పార్టీ నగరశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మ గుట్టపై కార్గిల్ చౌరస్తాలోని స్తూపానికి పూలమాలలు వేసి అమరులైన సైనికులకు నివాళులర్పించారు. వారి సేవలను గుర్తు చేసుకున్నారు.
భారత వాస్తవాధీన రేఖను ధాటి పాకిస్తాన్ సైనికులు చొరబాటును వీరోచితంగా తిప్పికొట్టి దేశం కోసం ప్రాణాలనర్పించిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో భాజపా నగర అధ్యక్షులు యెండల సుధాకర్, శ్రీనివాస్ శర్మ, ప్రధాన కార్యదర్శులు స్వామి యాదవ్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.