పలు ప్రత్యేకతలతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం దేశం దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనూ రికార్డును సొంతం చేసుకోబోతోంది. 36 టేబుళ్లపై ఓట్లు లెక్కించే నియోజకవర్గంగా నిలవనుంది. ఇదే స్థానం నుంచి 176 మంది రైతులతో పాటు వివిధ పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. నోటాతో కలిపి బ్యాలెట్లో 186 గుర్తులున్నాయి. అందుకే 12 బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ నిర్వహించారు.
ఫలితాల ఆలస్యాన్ని నివారించేందుకు టేబుళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. సోమవారం నాడు ఎన్నికల సంఘం ఈ అంశంపై స్పందించి 36 టేబుళ్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు దేశంలో 24 టేబుళ్లతోనే లెక్కించారు. 36 టేబుళ్లపై అనుమతివ్వడం ఇదే మెుదటిసారి అని అధికారులు తెలిపారు.
అదే రోజున ఫలితం
మెుత్తం 36 టేబుళ్లపై లెక్కించటం మే 23 తేదినే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 21న జరిగే నమూనా లెక్కింపు ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే.. వాటిని అధిగమించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తామని రిటర్నింగ్ అధికారి ఎంఆర్ఎం రావు తెలిపారు.
ఇవీ చూడండి : మెదక్లో గెలుపెవరిది..?