ETV Bharat / state

జిల్లాలో సరిపడా మరుగుదొడ్లు లేక ప్రజల ఇబ్బందులు - మరుగుదొడ్లు లేక ప్రజలు నానా అవస్థలు

పట్టణాలు, నగరాల్లో మరుగుదొడ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు. ఎటు చూసినా షాపింగ్ కాంప్లెక్స్‌లు, భారీ భవనాలు తప్ప శౌచాలయాల జాడ కనిపించదు. ఇక మహిళల అవస్థలు వర్ణనాతీతం. అందుకే ప్రభుత్వం ప్రజామరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. స్వాతంత్ర దినోత్సవానికల్లా పూర్తవ్వాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నా.. కొన్ని చోట్ల పూర్తయ్యే పిరిస్థితులు కన్పించడం లేదు

Inadequate toilet public problems in the nizamabad district
జిల్లాలో సరిపడా మరుగుదొడ్లు లేక ప్రజల ఇబ్బందులు
author img

By

Published : Aug 14, 2020, 10:41 PM IST

జిల్లాలో సరిపడా మరుగుదొడ్లు లేక ప్రజల ఇబ్బందులు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సరిపడా మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 227 శౌచాలయాలు కొత్తగా నిర్మిస్తున్నారు. వీటిలో 153 పూర్తి కాగా.. మిగిలినవి ఆగస్టు 15 వరకు పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు.

పూర్తి కానుండగా

భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో 14 మరుగుదొడ్లు పూర్తి కావొస్తున్నాయి. బోధన్ మున్సిపాలిటీలో 42 పూర్తి కానుండగా.. మరో 6 నిర్మించడానికి పనులు ప్రారంభించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 36 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 50శాతం షీ-టాయిలెట్లు నిర్మించి.. సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేసి అందుబాటులో తీసుకువస్తే ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : భీంపూర్​లో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.