నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం జలం ప్రభుత్వ పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సంఘం నిరసన ప్రదర్శించింది. రాష్ట్ర స్థాయి కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులను తొలగించకూడదని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి పారిశుద్ధ్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తోట రాజు వినతి పత్రం అందించారు.
ఒకటో తేదీనే వేతనాలివ్వాలి...
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని...ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ప్రధానోపాధ్యాాయుడిని రాజు కోరారు. ప్రోసిడింగ్ ఆర్డర్స్ కార్మికులందరికీ ఇవ్వాలని, ప్రతి నెలా ఒకటో తేదీనేే వేతనాలు చెల్లించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించి.. గుర్తింపు కార్డులు ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా 20న చలో దిల్లీ