తెరాస ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు : ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన సమావేశానికి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. నర్సాపూర్ చౌరస్తా నుంచి కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించటంలో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. పసుపు రైతులకు,ఎర్ర జొన్న రైతులకు ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు.
ఇవీ చూడండి :మహాకూటమి వస్తే నోట్ల రద్దుపై దర్యాప్తు: మమత