నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 49వ డివిజన్లో గల అశోక్‌నగర్‌లో శనివారం రాత్రి విద్యుదాఘాతంతో తులసి వెంకటరాం అనే వ్యక్తి ఇల్లు దగ్ధమైంది. ఈ క్రమంలో భాజపా నేత ధన్పాల్ సూర్యనారాయణ ఆదివారం బాధిత కుటుంబీకులను పరామర్శించారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. తక్షణ సహాయంగా రూ.10,000 ఆర్థిక సహాయం, 20 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు విజయ్, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీ నారాయణ, ఇల్లెందుల ప్రభాకర్, అమందు విజయ్ కృష్ణ, యతిన్ కృష్ణ, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.. భాగ్యనగరంలో కురుస్తోన్న వర్షాలు, వరదలపై జీహెచ్ఎంసీ అప్రమత్తం