ETV Bharat / state

అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్నాడని బాలుడి కాళ్లు కట్టేసి.. ఈడ్చుకెళ్లి... - నిజామాబాద్ జిల్లా వార్తలు

నిజామాబాద్ జిల్లా మల్కాపూర్(ఏ)లో అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్నాడని ఓ బాలుడిని అతని పెదనాన్న విచక్షణారహితంగా చితకబాదాడు. కాళ్లను తాడుతో కట్టి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఈ సంఘటనను స్థానికులు కొందరు వీడియో తీసి వాట్సాప్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.

nizamabad
nizamabad
author img

By

Published : Aug 12, 2020, 6:29 PM IST

Updated : Aug 12, 2020, 8:58 PM IST

అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్నాడని ఓ బాలుడిని అతని పెదనాన్న విచక్షణారహితంగా చితకబాదాడు. మల్కాపూర్‌కు చెందిన బాలయ్య కూతురి తోటి కోడలి కుమార్తెకు అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్నాడని తన తమ్ముడి కుమారుడు భీమయ్యను(14) బాలయ్య చితకబాదాడు. కాళ్లను తాడుతో కట్టి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మల్కాపూర్(ఏ)లో చోటుచేసుకుంది.

అనంతరం కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా... మళ్లీ ఇలాంటి తప్పు చేయనని బాధిత బాలుడు క్షమాపణ చెప్పడంతో తల్లిదండ్రులకు అప్పగించారు. చితకబాదుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Last Updated : Aug 12, 2020, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.