జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సమయంలో వర్షాలు కురిశాయి. అయితే గత వారం రోజుల నుంచి నిజామాబాద్ నగరంలో పొడి వాతావరణం నెలకొంది. ఈరోజు సాయంత్రం వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణం చల్లబడి వర్షం కురిసింది.
నిజామాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గాలితో కూడిన వర్షం వల్ల నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఇవీ చూడండి: జంటనగరాల్లో భారీ వర్షం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం