ETV Bharat / state

sriram sagar project water level: శ్రీరాంసాగర్‌కు వరద.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో(heavy rains in telangana) రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు(sriram sagar project water level) వచ్చి చేరుతోంది.

sriram sagar project water level, heavy flood to sri ram sagar project
శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద, శ్రీరాం సాగర్ నీటి మట్టం లేటెస్ట్
author img

By

Published : Sep 29, 2021, 12:06 PM IST

గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో(Gulab cyclone effect) మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలతో జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది(sriram sagar project water level). ఎగువ భాగాన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 3,96,000 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 4,49,800 క్యూసెక్కుల నీటిని 33 ప్రధాన గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,088.9అడుగుల మేర నీటి మట్టం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సాగర్‌కు వరద

నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది(Nagarjuna sagar water level). జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 57,557 క్యూసెక్కులుగా ఉంది. రెండు క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 589.9 అడుగులుగా ఉంది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 312.0405 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 311.74 టీఎంసీలుగా నమోదైంది.

తడిసి ముద్దయిన భాగ్యనగరం

గులాబ్‌ తుపాన్‌ బీభత్సంతో భాగ్యనగరంలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీ నది నిండుకుండలా మారింది. వికారాబాద్‌ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ తర్వాత తనలో ఈసీ నదిని కలుపుకొని గ్రేటర్‌ హైదరాబాద్‌లో దాదాపు 50 కిలోమీటర్ల పైనే ప్రవహిస్తోంది. మూసీ, ఈసీలపై జంటజలాశయాలను నిర్మించారు. చివరికి మూసీ కృష్ణా నదిలో కలుస్తుంది. గతేడాది అక్టోబరులో కురిసిన వానలకు కూడా మూసీ ఉద్ధృతం (Musi River in Spate)గా ప్రవహించింది. ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు జంటజలాశయాలు నిండటంతో మూసీలోకి వరద నీరు విడిచిపెడుతున్నారు. రెండు జలాశయాలకు భారీగా వరద చేరుతుండటంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరాయి.

గులాబ్ బీభత్సం

గతేడాది రాజేంద్రనగర్‌ పల్లె చెరువు వరదంతా గుర్రం చెరువుకు చేరుకోవడంతో.. తటాకానికి అధికారులు గండి కొట్టారు. నీరంతా అల్‌జుబైల్‌ కాలనీ, గాజిమిల్లత్‌ కాలనీ, ఇమ్రాకాలనీ, ఉప్పుగూడ, శివాజీనగర్‌, క్రాంతినగర్‌, అరుంధతి కాలనీ, సైఫాబాద్‌, ఉస్మాన్‌నగర్‌, హఫీజ్‌బాబానగర్‌ ప్రాంతాలను ముంచెత్తింది. స్థానికంగా నాలా ఆక్రమణలు తొలగిస్తే ఈ సమస్య ఉత్పన్నంకాదు. అధికారులు రాజకీయ కారణాలతో ఆ పనులు చేపట్టడం లేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.