కరోనా నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. భక్తులు సైతం ఆలయాలకు అంతంత మాత్రంగానే వచ్చారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. థర్మల్ స్క్రీనింగ్ చేయడంతోపాటు, శానిటైజర్‌లు అందుబాటులో ఉంచారు. మాస్కులు ఉన్న వారినే ఆలయం లోపలికి అనుమతించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు భక్తులు లేక వెలవెలబోయాయి.
నగర శివారు మాధవనగర్‌లోని సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక జాగ్రత్తల నడుమ భక్తులను అనుమతించారు. అలాగే నిజామాబాద్ నగరంలోని హమాల్ వాడీ సాయిబాబా ఆలయం, తేనె సాయిబాబా మందిరం, వినాయక్ నగర్ సద్గురుధామం, దత్తాత్రేయస్వామి, గాజుల్ పేట్ దత్తమందిరం, లలితాదేవి దత్తాలయంలో గురుపౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా కారణంగా అన్ని ఆలయాల్లో చాలా తక్కువ సంఖ్యలో భక్తులు కనిపించారు.
ఇదీ చూడండి: 'సీఎం ఫౌం హాస్ క్వారంటైన్లో ఉంటే.. కరోనా సమస్య పరిష్కారం కాదు'