ఖరీఫ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా రబీలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. లాక్‌డౌన్ పటిష్ఠంగా నిర్వహిస్తున్నందున ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని స్పష్టం చేయగా రైతులు హర్షం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో వరి కోతలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ హామీ మేరకు ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రామడుగు సొసైటీ ఛైర్మన్ రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. అధికారులు కరోనా నివారణ చర్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కొనుగోలు కేంద్రాల్లో భౌతిక దూరం తప్పనిసరి చేశారు.
ఇవీ చూడండి: కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!