ETV Bharat / state

లైవ్​ వీడియా: దొంగలు వచ్చి బెదిరించి దోచుకెళ్లారు - robbed-at-bodhan-petrol-pump

బోధన్ పట్టణం పరిసర ప్రాంతంల్లో రోజురోజుకీ దొంగల భయం ఎక్కువైంది. వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్నారు. రెండు రోజుల క్రితం బోధన్​లోని మొబైల్ షాపులో చోరీ చేశారు. అది మరువక ముందే తాజాగా పెట్రోల్​ బంక్​లో దొంగతానానికి పాల్పడ్డారు.

Four thieves came threatened and robbed at bodhan petrol pump nizamabad
లైవ్​ వీడియా: దొంగలు వచ్చి బెదిరించి దోచుకెళ్లారు
author img

By

Published : Sep 28, 2020, 11:25 AM IST

నిజమాబాద్ జిల్లా బోధన్ నర్సిరోడ్ పక్కన పెట్రోల్ బంక్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో పెట్రోల్ బంక్​లోకి దొంగలు చోరబడి కత్తులతో బెదిరించి రాళ్లతో దాడిచేసి క్యాష్ కౌంటర్​ను ఎత్తుకెళ్లారు.

లైవ్​ వీడియా: దొంగలు వచ్చి బెదిరించి దోచుకెళ్లారు

బోధన్ పట్టణంకు కూతవేటు దూరంలో ఉండే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్​లో నలుగురు దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ముగ్గురు క్యాష్ కౌంటర్​ను ఎత్తుకెళ్లగా.. ఒకరు ఆఫీస్ రూంలోకి చొరబడి డబ్బులు తీసుకుని పారిపోయారు.

దొంగలు ముఖానికి మాస్కులు ధరించి సంచిలో రాళ్లు తీసుకొచ్చి దాడి చేశారు. పెట్రోల్ బంక్ వెనుక నుంచి వైర్లు కట్​చేసి లోనికి వచ్చారు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ రామారావు, సీఐ రాకేష్ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : 20 గొర్రెలను బలి తీసుకున్న పాలవ్యాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.