కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ సమర్థమంతంగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలను అందరూ కొనియాడుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను నోట్ల దండలతో ఘనంగా సన్మానించారు. నగరంలోని గంగస్థాన్ కాలనీ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజల కోసం ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా పనిచేస్తున్న కార్మికుల సేవలకు ఏమిచ్చిన తక్కువేనని సొసైటీ అధ్యక్షుడు జగత్రెడ్డి అన్నారు. వారికి నిత్యావసర సరుకులు సైతం అందజేశారు.
ఇదీ చూడండి : తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు