Father and Daughter Died in Train Accident at Nizamabad District : దసరా పండుగ సెలవులు రావడంతో ఆ దంపతులు.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బాసర సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు ట్రైన్లో బయల్దేరారు. సీట్లు దొరకకపోవడంతో ఒక బోగీలో దంపతులు.. మరో బోగీలో కుమార్తెలు ఎక్కారు. అప్పటి వరకూ బాగానే గడిచింది. అనంతరం వేరే స్టేషన్‌లో వారు ఒకే బోగీలో మారేందుకు రైలు దిగారు. ఇలా మరో బోగీలోకి ఎక్కుతుండగా.. రైలు ముందుకు కదలడంతో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె రైలు కిందపడి మృతి చెందారు. కళ్లెదుటే భర్త, కుమార్తె మరణంతో.. మృతుడి భార్య విలపిస్తున్న తీరు అక్కడివారిని కలిచివేసింది.
ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad District) ఓని రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఇందుకు సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన రామచంద్రరావు(45)కు ఖమ్మం పట్టణానికి చెందిన సునీతతో 17 ఏళ్ల కింద వివాహం జరిగింది. ఆయన ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో స్థిరపడ్డారు.
Lorry Falls into Quarry Canal in Mulugu : క్వారీ కాల్వలోకి దూసుకెళ్లిన లారీ.. తండ్రీకుమారుల దుర్మరణం
Nizamabad Train Accident : ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె జస్మిత ఇంటర్ చదువుతుండగా, చిన్న కుమార్తె జనని(15) పదో తరగతి చదువుతోంది. శుక్రవారం బాసరలో సరస్వతీ దేవికి పూజ చేసేందుకు.. నలుగురు గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి రైలులో బయల్దేరారు. దంపతులిద్దరూ ఒక బోగీలో, ఇద్దరు కుమార్తెలు మరో బోగీ ఎక్కారు. నిజామాబాద్‌లో అందరూ ఒకే బోగీలోకి మారేందుకు రైలు దిగారు. భార్య ఉన్న బోగీలోకి పెద్ద కుమార్తె జస్మితను రామచంద్రరావు ఎక్కించారు. చిన్న కుమార్తె జననిని కూడా అదే బోగీలోకి ఎక్కిస్తుండగా రైలు ముందుకు కదిలింది. జనని పట్టుతప్పి రైలు కింద పడిపోయింది. ఆమెను పైకి లాగేందుకు ప్రయత్నించిన తండ్రి రామచంద్రరావు సైతం రైలు, పట్టాల మధ్య ఇరుక్కుపోయారు.
జనని ఆక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన రామచంద్రరావును స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో కళ్లెదుటే భర్త, చిన్న కుమార్తె మృతి చెందడంతో సునీత కుప్పకూలిపోయింది. వారి మృతదేహాలపై పడి ఆమె విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
School Bus Accident in Mahabubnagar : స్కూల్ బస్సు బోల్తా.. 20 మంది విద్యార్థులకు గాయాలు
Road Accident in Makthal Mandal : మరో రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని టిప్పర్‌ను వెనుక నుంచి వస్తున్న డీసీఎం వాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి నారాయణపేట మండలం మక్తల్ మండలంలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని చిక్‌మగళూరుకు చెందిన డ్రైవర్ విజయ్‌నాయక్(39), షఫీఉల్లా(31), జగదీష్(41) అక్కడి ఓ పౌల్ట్రీ యజమాని వద్ద పని చేస్తున్నారు. తరచూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కందుకూరు ఫౌల్ట్రీ నుంచి డీసీఎం వాహనంలో కోళ్లను చిక్‌మగళూరుకు తరలించేవారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కందుకూరు పౌల్ట్రీ నుంచి కోళ్లను డీసీఎంలో తీసుకెళ్తున్నారు. మక్తల్ మండలం బొందల్‌కుంట(నర్సిరెడ్డిపల్లి)కు వచ్చేసరికి జాతీయ రహదారిపై ముందుగా వెళుతున్న గుర్తుతెలియని వాహనాన్ని డీసీఎం ఢీకొట్టింది (Road Accident). దీంతో క్యాబిన్‌లో ఉన్న ముగ్గురూ ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందారు.