మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు మద్దతు ధర కల్పించాలని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ పెర్కిట్ శివారులోని జాతీయ రహదారి 44పై ధర్నా చేపట్టారు. అలాగే కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.
మొక్కజొన్న పంటకు రూ. 1,850, సోయాబీన్‌కు రూ. 3,850 మద్దతు ధర కల్పించాలని రైతులు, నాయకులు కోరారు. పంటలకు కావలసిన కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల దళారులు సిండికేట్‌గా ఏర్పడి అన్నదాతలను నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి రైతన్నలపై చిత్తశుద్ధి ఉంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా రాస్తారోకో, ధర్నా నిర్వహిస్తున్న భాజపా నాయకులను స్థానిక ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: వర్షానికి దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి: కిసాన్ మోర్చా