కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు దారులను అడ్డుకునే క్రమంలో అసువులు బాసిన వీర జవాన్ మహేశ్ మృతితో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని కోమన్‌పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేశ్ మరణం పట్ల ఆయన స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే సరిహద్దుల్లో దేశ భద్రత కోసం పని చేయాలన్న ఆలోచనలో ఆయన ఉండేవారని వారు తెలిపారు.
ఈ నెల 21న మహేశ్ పుట్టినరోజు ఉండగా... ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడం కలచి వేస్తోందని చెబుతున్న స్నేహితులు... ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన మిత్రుడు ఇక లేడనే మాటని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కశ్మీర్‌లో ఇద్దరు తెలుగు జవాన్ల వీరమరణం