నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్న గుట్టలో ఆరోగ్య అధికారుల తప్పిదం చేశారు. గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆరోగ్య సిబ్బంది అతనికి మందులు ఇచ్చారు. అదికూడా కాలం చెల్లిన మందులు పంపిణీ చేశారు. వాటిని తీసుకున్న వ్యక్తి గమనించడంతో అపాయం తప్పింది.
ఆరోగ్య సిబ్బంది కాలం చెల్లినవి పంపిణీ చేయడం వల్ల స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని చూసుకోకుండా వేసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో అని బాధితుడు వాపోయారు. సిబ్బంది చూసుకుని మందులు సరఫరా చేయాలని కోరారు.
ఇదీ చూడండి: పోడు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం: బండి సంజయ్