'నేను 13ఏళ్లకే ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టించాను. ప్రపంచంలోని ఏడు ఏత్తైన పర్వతాలు అధిరోహించాను. ఏడు ఏత్తైన పర్వతాల అధిరోహణకు చాలామంది ప్రోత్సహించారు. గురుకుల పాఠశాలలో ఉన్నప్పుడు అంతా సొసైటీవాళ్లు చూసుకునేవారు. పర్వతారోహకులు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలి. ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మృతదేహాలు చూసి భయపడ్డాను. కానీ సంకల్ప బలం ఉంటే ఎవరైనా అనుకున్నది సాధించవచ్చు. తల్లిదండ్రులు తమ ఆడ, మగ పిల్లలపై వ్యత్యాసం చూపొద్దు. ఇకపై నిధులు సేకరించి ఆడపిల్లల చదువుకు ఉపయోగిస్తాం. అమ్మాయిలు చదువుపై దృష్టి పెట్టి అనుకున్నది సాధించాలి.' - పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ
ఇవీ చదవండి: