Disputes between BJP leaders: నిజామాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్రలో భాజపా నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ధన్ పాల్ సూర్యనారాయణ, యెండల లక్ష్మీ నారాయణ మధ్య విభేదాలు బయటపడ్డాయి. శోభాయాత్ర కొద్దిసేపు ఆపాలని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ అనగా.. ఆపొద్దని రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ధన్ పాల్ సూర్యనారాయణను యెండల లక్ష్మినారాయణ నెట్టేశారు.
దీంతో అక్కడే ఉన్న పోలీసులు భాజపా నేతలకు సర్దిచెప్పేందుకు యత్నించారు. శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 8 ఏళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం సాగుతోంది: రేవంత్‌రెడ్డి