నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లో ఉపాధి హామీలో పని చేస్తున్న క్షేత్ర సహాయకులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ మండల పరిషత్ కార్యాలయాల వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 40 శాతం పని దినాలపై ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్ నంబర్ 4779 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పని ఒత్తిడి భారం మోపొద్దన్నారు. గత రెండు నెలలుగా చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగునంగా కనీస వేతనాల చట్టం ప్రకారం నెలకు రూ. 21 వేలు వేతనం, బదిలీలు, పదోన్నతులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్జ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెలో పాల్గొంటామని చెప్పారు.
ఇదీ చూడండి : భోజన పథకం బిల్లులేవీ ?? వంట ఎలా చేయాలి ?