నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో గాలివానకు భారీ పంట నష్టం వాటిల్లింది. రెండు మండలాల్లో ఐదు వందల ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం జరిగింది. ఆరబెట్టిన మొక్కజొన్న, సోయ పంటలు సైతం వర్షానికి తడిశాయి. కిసాన్‌నగర్‌లో బలంగా వీచిన గాలికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదికి పైగా చెట్లు నేలకొరిగాయి.
నేలవాలిన పైరును మండల వ్యవసాయాధికారి మహేందర్‌రెడ్డి, తెరాస నాయకులు పరిశీలించారు. పంట నష్టం వివరాలు సేకరించి, తగిన పరిహారం అందిస్తామని తెలిపారు.
- ఇదీ చూడండి : కోహ్లీ, సానియాలకు ఛాలెంజ్ విసిరిన సింధు