డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరులో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
బోధన్ మండలం పెద్ద నవానందిలో అడ్డగోలుగా అనర్హులకు ఇళ్లు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వై.గంగాధర్, శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.