ETV Bharat / state

'అమరుల ఆశయాలను సాధించటంలో ప్రభుత్వం విఫలం' - 'అమరుల ఆశయాలను సాధించటంలో ప్రభుత్వం విఫలం'

నిజామాబాద్​లో సీపీఐ(ఎంఎల్​) న్యూడెమోక్రసీ నాయకుల ఆధ్వర్యంలో పీపుల్స్​ డిమాండ్స్​ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ(ఎంల్​) జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ... ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

cpi ml leaders fire on trs government
'అమరుల ఆశయాలను సాధించటంలో ప్రభుత్వం విఫలం'
author img

By

Published : Jun 2, 2020, 10:26 PM IST

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు నిజామాబాద్ జిల్లా కమిటీ పీపుల్స్ డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, అమరుల ఆశయాలను సాధించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ(ఎంఎల్​) జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్​ ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు కాలేదన్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. కాంట్రాక్టులన్నీ ఆంధ్రా పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని దోచుకొని... అప్పుల పాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను పూర్తిగా అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి: ఐదుగురు పిల్లలకు ఆస్తి పంచారు.. ఆ తర్వాత...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.