నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చెక్కి క్యాంపులో వివాహానికి హాజరైన వారిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత వారం జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించగా ఇప్పటికే 50 మందికి పాజిటివ్ వచ్చింది.
కేసుల సంఖ్య పెరగడం వల్ల వైద్య శాఖ అధికారులు గ్రామంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాజాగా గురువారం 104 మందికి పరీక్షలు చేయగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం బాధితుల సంఖ్య 67కి చేరింది. ఈ క్రమంలో గ్రామంలోని మిగతా వారికి కూడా పరీక్షలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.