ETV Bharat / state

పండుగ కోసమని వచ్చారు.. వస్తు వస్తూ కరోనా తెచ్చారు

సడలింపు ఉంది కదా ఓ కుటుంబం పండుగ చేశారు. బస్సులు ఉన్నాయి కదా అని బంధువులు తరిలి వచ్చారు. వచ్చిన వాళ్లు ప్రేమతో పాటు.. కరోనాని సైతం పట్టుకొచ్చారు. ఇంకేముంది అప్పటి వరకు ఒకటి, రెండు ఉన్న కేసు ఏకంగా 45 కు చేరాయి. మరి ఆ చుట్టాలు వచ్చింది ఎక్కడినుంచి అనుకున్నారు....?

corona cases high in kantam village nandipet zone nizamabad distric
పండుగ కోసమని వచ్చారు.. వస్తు వస్తూ కరోనా తెచ్చారు
author img

By

Published : Jun 8, 2021, 7:05 AM IST

సడలింపు ఉన్న సమయంలో చేసిన పండుగ ఆ ఊరిలో కలకలం రేపుతోంది. గ్రామంలో ఒక్క సారిగా కరోనా కేసులు పెరగడంతో గ్రామస్థుల్లో కలవరం మొదలైంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కంఠం గ్రామంలో గడిచిన మూడు రోజుల్లో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ కుటుంబం 'కందూరు పండుగ' నిర్వహించగా.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామం నుంచి బంధువులు వచ్చారు.

45కు వరకు కేసులు...

పండగా తరువాత అప్పటివరకు 1 లేదా 2 ఉన్న కేసులు ఒక్కసారిగా 45 వరకు చేరుకోవడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామం నుంచి వచ్చిన బంధువుల వల్లే కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పండగ నిర్వహించిన కుటుంబ సభ్యుల్లో ఏడుగురికి వైరస్ సోకింది. వారికి వ్యాధి నిర్ధారణ కాకముందే... గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లడంతో గ్రామంలోని మిగతా వారికి కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో గ్రామాన్ని పూర్తి కంటోన్మెంట్ జోన్​గా ప్రకటించారు. పక్కనే ఉన్న ఐలాపూర్​లో 12 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

ప్రత్యేక వైద్య శిబిరాలు..

ఇంటింటి సర్వేలో కొవిడ్ లక్షణాలు బయటపడటంతో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆర్మూర్ డిప్యూటీ డీఎంఅండ్​హెచ్ఓ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని మిగతా వారికి కూడా కరోనా టెస్ట్​లు నిర్వహిస్తున్నారు. నందిపేట్ ఎస్ఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తూ.. ఎవరు బయటకు వెళ్లకుండా, బయటి నుంచి ఎవరు గ్రామంలోకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్కసారిగా కరోనా కేసులు అధికమవడంతో గ్రామాన్ని ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవోలు సందర్శించారు. కరోనాపై అవగాహన కల్పస్తూయ.. గ్రామస్థులకు భరోసా కల్పించారు.

ఇదీ చూడండి: నేడు కేబినెట్​ భేటీ.. లాక్​డౌన్​ పొడిగింపుపై క్లారిటీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.