ETV Bharat / state

సాగు చట్టాలపై ప్రశ్నిస్తారనే.. సమావేశాల రద్దు: కాంగ్రెస్ - nizamabad district latest news

కేంద్ర ప్రభుత్వం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రద్దు చేయడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.

cancellation of winter parliamentary sessions
శీతాకాల సమావేశాలు రద్దు చేయడంపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
author img

By

Published : Dec 30, 2020, 7:43 PM IST

కేంద్ర ప్రభుత్వం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రద్దు చేయడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బైఠాయించి రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రతిపక్షాలు నిలదీస్తాయనే ఉద్దేశంతో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రద్దు చేశారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నారు.

రైతాంగాన్ని నిండా ముంచే కార్యక్రమాలకు మోదీ, కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని ఆరోపించారు. భాజపా, తెరాస రెండు రెండేనని అన్నారు. ఎన్నికల ముందు వేరువేరుగా ఉండి అనంతరం కలిసి ఉంటారనే విషయాన్ని ప్రజలు గ్రహించారని తెలిపారు.

ఇదీ చదవండి: 'రేపు సీబీఎస్​ఈ పరీక్షల షెడ్యూల్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.