పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో ఇచ్చినా హామీ ఏమైందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఐదు రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తానన్న ఎంపీ ఎందుకు కాలాయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఆధ్వర్వంలో పసుపు రైతులు, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులతో పసుపుబోర్డు-మద్దతుధర అంశంపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రైతుసంఘాల ఉద్యమాలు, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. గత ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ ఇచ్చినా హామీని నిలబెట్టుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర విషయంలో అన్నదాతలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మోహన్‌రెడ్డి ఆరోపించారు.