ETV Bharat / state

కల్లెడలో రాజుకుంటున్న పోడు భూమి వివాదం - కల్లెడలో రాజుకుంటున్న పోడు భూమి వివాదం

దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమి నుంచి అటవీ అధికారులు గెటేస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. కన్నతల్లిలా సాకిన భూమిని బలవంతంగా లాక్కొంటున్నారని గగ్గోలు పెడుతున్నారు. పాసుపుస్తకాలివ్వకుండా అధికారులు చేసిన కాలయాపన తమపాలిట శాపంగా మారిందని... దీనితో సొంతభూమిలోనే అనాథలుగా మారామంటున్నారు నిజామాబాద్​ జిల్లా మాక్లూర్​ మండలం కల్లెడ గ్రామానికి చెందిన కొందరు రైతులు.

కల్లెడలో రాజుకుంటున్న పోడు భూమి వివాదం
author img

By

Published : Jul 30, 2019, 12:04 AM IST

నిజామాబాద్​ జిల్లాలో ఎన్నడూ లేనిది వరుసగా పోడు వివాదం రాజుకుంటోంది. తాజాగా మాక్లూర్​ మండలం కల్లెడలో అటవీ అధికారులు భూములు దున్ని మొక్కలు నాటారు. తరతరాలుగా ఆ భూమినే నమ్మకుని సాగు చేసుకుంటున్న రైతులను ఖాళీ చేయిస్తున్నారు. సర్వే నంబరు 570 లోని 124.16 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేసుకుంటున్న భూమిని అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఈ భూమినే నమ్మకుని బతుకుతున్నాం

ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి భూమిశిస్తు, కరెంటు బిల్లులు కడుతున్నామని.. ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నామని కాని ఇప్పుడు బలవంతంగా వెల్లగొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏ అధికారికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమిపోతే ఆత్మహత్యే శరణ్యమంటున్నారు.

చట్టప్రకారమే ముందుకెళ్తున్నాం

కాళేశ్వరం ప్రాజెక్టు కింద కోల్పోయిన అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో మొక్కలు నాటుతున్నామని ఫారెస్ట్​ అధికారులు చెబుతున్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేసినప్పుడు 570 సర్వే నంబరు భూమి అటవీ శాఖకు చెందినదేనని ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు.
ఇటు అధికారులు, అటు ప్రజా ప్రతినిధులు తమ గోడును పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. దీనిపైన ఆధారపడిన తమకు పట్టాలిచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. జీవనాధారం కోల్పోయి రోడ్డున పడతామని తమను కనికరించమని వేడుకుంటున్నారు.

కల్లెడలో రాజుకుంటున్న పోడు భూమి వివాదం
ఇదీ చూడండి: బతుకుదెరువు లేదు... దారి చూపండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.