లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి భోజనం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా తన సొంత ఖర్చులతో గత నెల రోజులుగా నిత్యం 1500 మందికి భోజనం పంపిణీ చేయడాన్ని వారు అభినందించారు.
కరోనా కట్టడికోసం పాటుపడుతున్న వారికి తమ వంతు సాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్, సీపీ చేతుల మీదుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి భోజనం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూ కిరణ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, నూడా ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి తదితర్లు పాల్గొన్నారు.