ETV Bharat / state

ధాన్యం సేకరణలో 9 లక్షల టన్నుల ఉత్పత్తే లక్ష్యం:కలెక్టర్​ నారాయణరెడ్డి

వానాకాలం వరిధాన్యం సేకరణలో జిల్లాలో 9 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని నిజామాబాద్​ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. కాలూర్​లోని ఓ రైస్​మిల్​లో జరుగుతున్న ధాన్యం సేకరణ, మిల్లింగ్​ ప్రక్రియను ఆయన పరిశీలించారు.​

collector narayana reddy visit paddy center in nizamabad kalur
ధాన్యం సేకరణలో 9 లక్షల టన్నుల ఉత్పత్తే లక్ష్యం:కలెక్టర్​ నారాయణరెడ్డి
author img

By

Published : Oct 31, 2020, 12:57 PM IST

నిజామాబాద్​ జిల్లా కాలూర్ గ్రామంలోని సిద్ది రామేశ్వర్ రైస్ మిల్​లో ధాన్యం సేకరణ, మిల్లింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. రైస్​మిల్​ పక్కనే కోత కోస్తున్న హైర్వెస్టర్, కోసిన ధాన్యం నాణ్యతను పరిశీలించి రైతులతో కొద్ది సమయం ముచ్చటించారు. వానాకాలం ధాన్యం సేకరణలో 9 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించటమే లక్ష్యంగా చేసుకున్నామని ఆయన తెలిపారు.

అందులో 7 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని జిల్లాలోని 445 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి 247 రైస్ మిల్లర్లకు కేటాయింపు చేయటం జరిగిందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద టెస్ట్ చేసి వరి ధాన్యాన్ని రైస్​మిల్లులకు పంపేవిధంగా ఒక ఏఈవోను నియమించామన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీ గోవింద్, డీసీఓ సింహాచలం, సివిల్ సప్లై అధికారులు, నిజామాబాద్ ఎమ్మార్వో ప్రవీణ్, సర్పంచ్, ఎంపీటీసీ, ప్యాక్స్ ఛైర్మన్​, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తూకాలను జాప్యం చేయకూడదు: మంత్రి ఈటల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.