ETV Bharat / state

డబుల్​బెడ్​ రూం ఇళ్లను  పరిశీలించిన కలెక్టర్​ నారాయణరెడ్డి - ఇందల్వాయి మండలం

నిజామాబాద్​ జిల్లాలోని ఇందల్వాయి మండల కేంద్రంలో, గన్నారంలో నిర్మిస్తున్న డబుల్​ బెడ్​రూం ఇండ్లను జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి పరిశీలించారు. పనులను పర్యవేక్షించిన కలెక్టర్​ పురోగతిపై అధికారులను ప్రశంసించారు.

collector inspects double bed room construction in indalvai mandal
డబుల్​బెడ్​ రూం ఇళ్లను  పరిశీలించిన కలెక్టర్​ నారాయణరెడ్డి
author img

By

Published : Jul 4, 2020, 11:02 PM IST

నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు.. గన్నారంలో నిర్మిస్తున్న డబుల్​ బెడ్​రూం ఇండ్లను శనివారం జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి పరిశీలించారు. ఇందల్వాయిలో నిర్మిస్తున్న డబుల్​ బెడ్​రూం పనులను కలెక్టర్​ సమీక్షించారు. పనుల పురోగతి బాగుందని, డబుల్​ బెడ్​రూం నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి.. లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్​ సూచించారు.

గ్రామంలో ఎన్​ఆర్ఈజీఎస్​ ద్వారా ప్లాంటేషన్​ చేసుకొని గ్రామాన్ని అందంగా తీర్చి దిద్దడానికి 50 నుంచి 100 వరకు కొబ్బరి, అశోక చెట్లు నాటాలని సూచించారు. గన్నారంలోని డబుల్​ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం కొరకు గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ సింహాచలం, ఆర్​అండ్​ బీ ఎస్​ఈ రాజేశ్వర్​రెడ్డి, ఈఈ రాంబాబు, డీఈ రాజేందర్​, ఎంపీడీవో రాములు, తహశీల్దార్​ రమేష్​, ఎంపీపీ రమేష్​ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.