ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరందించేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్.. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి జిల్లాలో కాళేశ్వరం పనుల ప్రగతిని పరిశీలించారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మిస్తోన్న ప్యాకేజి 20, 21, 21ఏ పనులను పర్యవేక్షించారు. జిల్లాలోని బినోల, సారంగాపూర్, మంచిప్ప, మెంట్రాజ్‌పల్లి వద్ద పంప్‌హౌజ్, సర్జిపూల్, టన్నెల పనులను పరిశీలించి, అధికారులను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెంట్రాజ్‌పల్లి వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, నిధులు, ఇతర అంశాలపై సమీక్షలో చర్చించి దిశానిర్దేశం చేశారు. స్మితా సబర్వాల్ పర్యటనతో పనుల్లో మరింత వేగం పెరగనుందని మంత్రి తెలిపారు. రైతులు కాళేశ్వరం పనులకు సహకరించి, పూర్తయ్యేలా చూడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత