సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయం వద్ద భోగి మంటల్లో చట్టాల పత్రాలు తగులబెట్టి నిరసన తెలిపారు.
కొమ్ము కాస్తోంది..
చట్టాలు రద్దు చేయాలని దిల్లీలో కోట్లాది మంది రైతులు యాభై రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారని ప్రజా సంఘాల నేత నూర్జహాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు.
పోరాడాలి..
చట్టాలు కార్పొరేట్లకు ఉపయోగపడేలా, రైతుకు నష్టం కలిగే విధంగా తీసుకొచ్చారని ఆరోపించారు. దిల్లీ నుంచి గల్లీ దాకా అన్నదాతలు ఐక్యంగా పోరాడాలని కోరారు.
కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోవర్ధన్, ఈవీఎల్ నారాయణ, పెద్ది సూరి, శ్రీనివాస్ రాజ్, కటారి రాములు, కృష్ణ, మహేష్, వేణు, మాధవి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రైతుల భవిష్యత్తును సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారు : భట్టి