నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వారికి కనీస వేతనంగా రూ.10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విధులు నిర్వహిస్తున్న ఆశావర్కర్లకు అదనంగా రూ.5000 వేతనం ఇస్తున్నారన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశ కార్యకర్తలను ఆదుకోవాలని కోరారు.
కరోనా నియంత్రణకు నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలపై ప్రభుత్వం వెంటనే చొరవ చూపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. అనంతరం ఆరోగ్య శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం