నిజామాబాద్ జిల్లా బాల్కొండలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గోదావరి, గంగా జలాలతో జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ గంగా జలాలతో జలాభిషేకం చేశారు.
గోదావరి నదిలో పవిత్ర గంగా జలాలను బిందెలలో తీసుకొచ్చి గ్రామంలో ఊరేగించారు. అనంతరం గ్రామంలోని అన్ని దేవతలకు జలాభిషేకం చేశారు. వివిధ కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పోతురాజులు విన్యాసం ఆకట్టుకుంది.
ఇదీ చూడండి: ఆ పాప నడవాలంటే రూ.16కోట్ల ఇంజక్షన్ వేయాలంటా!