Two youngsters died in accident:మృత్వువు వారిని వెంటాడింది. ఊహించని ప్రమాదం ఇద్దరు యువకులను బలితీసుకుంది. రెండు బైకులు ఢీకొని కిందపడిన ఇద్దరిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లాక్కోర వద్ద చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిందిలా..
ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు మోర్తాడ్ వైపు వెళ్తుండగా మరో బైక్ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఇద్దరు మృత్యువాత పడ్డారు. వారిలో ఒకరిని కారు కొంతదూరం ఈడ్చుకెళ్లింది. మృతులు జక్రాన్ పల్లి మండలం తొర్లికొండకు చెందిన వారిగా భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: