నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస చేపట్టిన సమ్మె 9వ రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్నారు. అందువల్ల అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపిస్తున్నారు. దసరా పండుగ ముగించుకుని వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిజామాబాద్ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు నడిపిస్తున్నారు. హైదరాబాద్కు ఎక్కువ సంఖ్యలో బస్సులు తిప్పుతున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు.
ఇవీ చూడండి: చిరుత వేట: గుమ్మం ముందు నిద్రించే శునకాలే టార్గెట్!