తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ... నిజామాబాద్ జిల్లా బోధన్ భాజపా నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఎంఐఎం పార్టీకి భయపడి తెరాస ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపటంలేదని భాజపా మండల అధ్యక్షుడు పోశెట్టి ఆరోపించారు.
తెలంగాణ రాక ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్... ఇప్పుడు ఎందుకు విమోచన దినోత్సవాన్ని చేయడం లేదని నాయకులు ప్రశ్నించారు. ఆనాడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోలో ఆపరేషన్ ద్వారా నిజాం సర్కార్ నుంచి తెలంగాణ విముక్తి కలిగిందని గుర్తు చేశారు. కావున సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరారు.
![bodhan bjp leaders given petition to mro](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-04-08-vimochana-dinaanni-adikaarikamga-nirvahinchaali-av-ts10109_08092020120155_0809f_1599546715_630.jpg)