నిజామాబాద్ నగరంలోని స్థానిక రెడ్ క్రాస్ భవనంలో ఇందూరు బ్లడ్ డోనర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందూరు బ్లడ్ డోనర్స్ గ్రూప్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 20 మంది యువకులు రక్తదానం చేశారు. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని ఆశయంతో ఒక మంచి ఆలోచనతో నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఇందూరు బ్లడ్ డోనర్స్ గ్రూపు ఏర్పాటు చేశామని గ్రూప్ అడ్మిన్ నరాల సుధాకర్ తెలిపారు.
ఇతరులకు ఎంతో కొంత సహాయం చేయాలని చాలా మందికి ఆలోచన ఉన్న వాళ్లందరినీ ఒకచోటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గ్రూపు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, బస్సా ఆంజనేయులు, నీలి రామచందర్, రామకృష్ణ, తోట రాజశేఖర్, పురుషోత్తం, కోయ్యాడ శంకర్, రిషి దీప్, దీక్షిత్, సంతోష్, కార్తీక్, నాగరాజు, గంగ కిషన్, శ్రీనివాస్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'వలస కార్మికులకు ఇచ్చే నగదు పెంచాలి'